ఉత్తర తమిళనాడుపై 'మాండూస్' పంజా
- తీరం దాటిన మాండూస్
- తమిళనాడు భూభాగంపై ప్రవేశించి వాయుగుండంగా మారిన వైనం
- నిన్నటి నుంచి ఉత్తర తమిళనాడు జిల్లాల్లో భారీ వర్షాలు
- 65 కిమీ వేగంతో గాలులు
- విద్యా సంస్థలకు సెలవు
మాండూస్ తుపాను తీరం దాటి వాయుగుండంగా బలహీనపడినప్పటికీ ఉత్తర తమిళనాడుపై అత్యధిక ప్రభావం చూపుతోంది. అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలకు చెన్నైలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తమిళనాడులో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వాతావరణం ప్రతికూలంగా మారడంతో 13 అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు చేశారు.
తుపాను ప్రభావం నేపథ్యంలో సీఎం స్టాలిన్ చెన్నైలోని ఓ బాధితుల సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. 'మాండూస్' ప్రభావంతో రాష్ట్రంలో నలుగురు మృతి చెందారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో తమిళనాడు సర్కారు 5 వేల సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది. మాండూస్ ధాటికి గురైన చెంగల్పట్టు జిల్లాలో 1000 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అటు, పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.