ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ... 300 దాటిన టీమిండియా స్కోరు
- 126 బంతుల్లో మెరుపు డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్
- 91 పరుగులతో క్రీజులో ఉన్న కోహ్లీ
- భారత్ స్కోరు 37 ఓవర్లలో 314 పరుగులు
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. యువ బ్యాట్స్ మెన్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కోహ్లీతో కలిసి బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న ఇషాన్ డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 126 బంతుల్లో ద్విశతకాన్ని సాధించాడు. ఇందులో 9 సిక్స్ లు, 23 ఫోర్లు ఉన్నాయి. డబుల్ సాధించిన తర్వాత కూడా అదే ఊపులో మరో ఫోర్, మరో సిక్స్ కొట్టిన ఇషాన్ తర్వాతి బంతికి ఔట్ అయ్యాడు.
ఇషాన్ ఔట్ కావడంతో ఒక మెరుపు ఇన్నింగ్స్ కు తెరపడింది. మొత్తం 131 బంతులను ఎదుర్కొన్న ఇషాన్ 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులకు ఔట్ అయ్యాడు. మరోవైపు కోహ్లీ 91 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 37 ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 314 పరుగులు. భారత్ దూకుడు చూస్తుంటే 450 పరుగులు సాధించే పరిస్థితి కనిపిస్తోంది.