రూ.8,500కే శామ్ సంగ్ కొత్త ఫోన్.. దీర్ఘకాలం పాటు సాఫ్ట్ వేర్ సపోర్ట్
- రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్
- ఆండ్రాయిడ్ 14 వరకు అప్ గ్రేడ్ కావచ్చు
- 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు
- స్టోరేజ్ లో రెండు ఆప్షన్లు
- 128జీబీ వరకు ఎక్స్ పాండబుల్ ర్యామ్
శామ్ సంగ్ అతి తక్కువ ధరలో ఓ స్మార్ట్ ఫోన్ ను భారత వినియోగదారుల కోసం విడుదల చేసింది. ఎం04తో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.8,500. ఆండ్రాయిడ్ 12 ఓఎస్ పై పనిచేస్తుంది. బేసిక్ స్మార్ట్ ఫోన్ కోరుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
ఈ ఫోన్ కు రెండేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ ఇస్తుంది. అంటే ఆండ్రాయిడ్ 13, ఆండ్రాయిడ్ 14వరకు అప్ గ్రేడ్ కావచ్చు. సాఫ్ట్ వేర్ సెక్యూరిటీ అప్ డేట్స్ ను కూడా దీర్ఘకాలం పాటు అందిస్తుంది. దీని ద్వారా ఎక్కువ అమ్మకాలు చేసుకోవచ్చన్నది కంపెనీ వ్యూహంగా కనిపిస్తోంది. సాధారణంగా సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ అన్నవి కొంచెం అధిక ధర ఫోన్లకే ఇప్పటి వరకు ప్రత్యేకం అని తెలిసిందే.
ఈ ఫోన్ లో 6.51 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, వెనుక భాగంలో 13 మెగా పిక్సల్, 2 మెగాపిక్సల్ తో రెండు కెమెరాలు, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జర్, ఎంటీకే పీ35 ప్రాసెసర్ ఉన్నాయి. 4జీబీ ర్యామ్ తో వస్తుంది. వర్చువల్ గా 8జీబీ ర్యామ్ వరకు పెంచుకోవచ్చు. ఇంటర్నల్ స్టోరేజీలో 64జీబీ, 128జీబీ స్టోరేజీ రెండు రకాల వేరియంట్లతో వస్తుంది. ఫోన్ పవర్ బటన్ వద్ద ఏర్పాటు చేసిన ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లు ఉన్నాయి. శామ్ సంగ్, అమెజాన్ పోర్టళ్లపై ఈ నెల 16న మధ్యాహ్నం 12 గంటలకు విక్రయాలు మొదలు కానున్నాయి.