విజయవాడ రైల్వే స్టేషన్‌లో తీరిన ప్రయాణికుల టిక్కెట్ల ఇక్కట్లు.. సత్ఫలితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
- యూటీఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన రైల్వే
- స్టేషన్‌లోని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా టికెట్
- టికెట్ కౌంటర్ల వద్ద తగ్గుతున్న రద్దీ
విజయవాడ రైల్వే ప్రయాణికులకు టికెట్ కష్టాలు తప్పాయి. నిమిషాల తరబడి క్యూలో నిల్చోకుండా క్యూ ఆర్ కోడ్‌ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫలితంగా దానిని స్కాన్ చేసి కావాల్సిన టికెట్‌ను తీసుకునే వెసులుబాటు ప్రయాణికులకు లభించింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైల్వే అధికారులు యూటీఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో చాలామంది ప్రయాణికులు దాని ద్వారానే టికెట్ తీసుకుంటున్నారు.
మరీ ముఖ్యంగా ఉదయం వేళ విజయవాడ నుంచి విశాఖపట్టణం, చెన్నై, సికింద్రాబాద్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ప్రయాణికులు జనరల్ టికెట్ల కోసం పడరాని పాట్లు పడేవారు. చాలాసేపు ముందుగానే స్టేషన్‌కు చేరుకుని టికెట్ కోసం క్యూలో నిల్చునేవారు. ఒక్కోసారి టికెట్ తీసుకోవడానికి ముందే రైలు కదిలిపోయేది. దీంతో కౌంటర్ల వద్ద పెరిగిపోతున్న రద్దీ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు యూటీఎస్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి స్టేషన్‌లో ఎక్కడికక్కడ క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశారు.
ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకున్నాక యూటీఎస్ యాప్‌ను ఓపెన్ చేసి అక్కడి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే సరి. ఎక్కడి కావాలంటే అక్కడికి టికెట్ తీసుకుని ఎంచక్కా వెళ్లిపోవచ్చు. క్షణాల్లోనే టికెట్ చేతిలోకి వస్తుండడంతో ప్రయాణికుల వెతలు తప్పాయి. టికెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గింది. టికెట్ కోసం స్టేషన్‌కు ముుందుగా రావాల్సిన బాధ కూడా తప్పింది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తుండడంతో ప్రస్తుతం 5 బుకింగ్ కౌంటర్ల వద్ద ఏర్పాటు చేసిన ఈ క్యూఆర్ కోడ్‌లను దశలవారీగా అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.