జోరు వానలోనూ ఇంటింటికీ తిరిగి సమస్యలు తెలుసుకున్న నారా లోకేశ్

  • మంగళగిరి నియోజకవర్గంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి
  • పెనుమూలి గ్రామంలో కార్యక్రమం
  • హాజరైన నారా లోకేశ్
  • విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పటికీ పర్యటన కొనసాగింపు
తుపాను ప్రభావంతో ఓ వైపు జోరువాన... మరోవైపు విద్యుత్ సరఫరా నిలిచిపోయిన వైనం... అయినప్పటికీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటన ఆగలేదు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలిలో శుక్రవారం 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. జోరు వానలోనూ ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆకాశాన్నంటుతున్న ధరలు తగ్గాలంటే సీఎం జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపాలని  పిలుపునిచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలు ఒక్కటి కూడా ఎమ్మెల్యే పరిష్కరించలేదని ఆరోపించారు. 

కాగా, లోకేశ్ పర్యటన ప్రారంభం అవుతుండగానే గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో లోకేశ్ చిమ్మచీకటిలోనూ గ్రామంలో తన పర్యటనని కొనసాగించారు. లోకేశ్ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతలు కావాలనే కరెంటు కట్ చేయించారని టీడీపీ ఆరోపించింది.


More Telugu News