మూవీ రివ్యూ: 'పంచతంత్రం'
- ఈ రోజునే థియేటర్లకు వచ్చిన 'పంచతంత్రం'
- చాలా గ్యాప్ తరువాత కనిపించిన స్వాతి రెడ్డి
- వెబ్ సిరీస్ కంటెంట్ కి దగ్గరగా కనిపించే కథలు
- కథనంలో వేగం లేకపోవడం మరో సమస్య
- అక్కడక్కడ మాత్రమే ఆకట్టుకునే సన్నివేశాలు
సాధారణంగా సినిమా కథలు అటు హీరో ఫ్యామిలీ .. ఇటు హీరోయిన్ ఫ్యామిలీ .. మరో వైపున విలన్ అరాచకాలతో ముడిపడి నడుస్తుంటాయి. కానీ ఈ మధ్య కాలంలో కథలో కొంతమంది జీవితాలను చూపిస్తూ, ముగింపులో ఆ పాత్రలను ఒకచోటున చేర్చడం అనే ఒక ప్రక్రియ ఎక్కువగా కనిపిస్తూ వస్తోంది. అలా కాకుండా ఏ కథకు ఆ కథను ఒక్కో ఎపిసోడ్ రూపొందించి, ఒక సినిమాగా అందించే కొత్త ప్రక్రియకు ఊతాన్ని ఇచ్చే సినిమాగా 'పంచతంత్రం' కనిపిస్తుంది.
నీతికథలుగా 'పంచతంత్రం' చాలామందికి తెలుసు. ఈ పంచతంత్రం ఆనందాలు .. అనుభూతులు .. భావోద్వేగాలను సున్నితంగా ఆవిష్కరించే ఐదు కథల సమాహారం. ఒక కథ ఆగిపోయిన తరువాత మరో కథ ఎలా మొదలవుతుంది? అనేదే ఇక్కడ అందరిలో ఆసక్తిని రేకెత్తించే అంశం. ఆ కథలను నడిపించే కథకుడిగా .. ఈ సినిమాలో రచయిత పాత్రగా బ్రహ్మానందం కనిపిస్తారు. వేదవ్యాస్ అనే ఆయన పాత్రతోనే ఈ సినిమా మొదలవుతుంది.
పంచేంద్రియాలకు .. పంచతంత్రానికి ముడిపెడుతూ ఈ కథలోకి ప్రేక్షకులను లాగడం జరుగుతుంది. మొదటి కథలో నరేశ్ అగస్త్య - శ్రీవిద్య, రెండవ కథలో రాహుల్ విజయ్ - శివాత్మిక, మూడో కథలో సముద్రఖని - దివ్యవాణి, నాల్గో కథలో దివ్య శ్రీపాద, ఐదో కథలో స్వాతి రెడ్డి - ఆదర్శ్ బాలకృష్ణ ప్రధానమైన పాత్రలను పోషించారు.
మొదటి రెండు కథలు కూడా చిన్న చిన్న అనుభూతులు కూడా జీవితాన్ని ఆనందమయం చేసి, మరింత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తాయనే విషయాన్ని చెబుతాయి. మూడో కథ తండ్రీ కూతుళ్ల అనుబంధానికి అద్దం పడితే, నాల్గో కథ భార్యాభర్తల అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఇక ఐదో కథ ఆశను .. ఆత్మవిశ్వాసాన్ని కలిపి ఆవిష్కరిస్తుంది. చివరి మూడు కథలు కదిలించేవే .. కన్నీళ్లు తెప్పించేవే.
ఈ సినిమా విషయంలో ముందుగా అఖిలేశ్ - సృజన్ లను అభినందించాలి. ఎందుకంటే ఎలాంటి కమర్షియల్ అంశాలను లేని కంటెంట్ ఇది. అనుభూతి ప్రధానంగా మాత్రమే నడుస్తూ .. ఆస్వాదించే కథలు ఇవి. ఇలాంటి కథలు ఓటీటీ సినిమాలుగా .. వెబ్ సిరీస్ లుగా వర్కౌట్ అవుతాయిగానీ, సినిమాగా మాత్రం వర్కౌట్ కావు. ఎందుకంటే ఒక కమర్షియల్ సినిమాకి ఉండవలసిన లక్షణాలు ఆల్రెడీ ఫిక్స్ చేయబడి ఉండటం వలన, ఈ సినిమాను ఆ జాబితాలోకి చేర్చుకోలేరు. అయినా నిర్మాతలుగా అందుకు పూనుకోవడం వారి అభిరుచికి అద్దం పడుతుంది.
దర్శకుడు హర్ష పులిపాక రాసుకున్న ఐదు కథల్లో మొదటి రెండు కథలు కూడా అనుభూతి ప్రధానమైనవే. అయితే అంత సున్నితమైన అనుభూతికి కనెక్ట్ కానివారు 'అసలు ఏముంది ఈ కథల్లో' అనుకునే అవకాశం లేకపోలేదు. మిగతా మూడు కథలు మనసును టచ్ చేయవని కాదుగానీ, అవి సినిమా స్థాయికి తగినవని మాత్రం ఒప్పుకోలేం. కమర్షియల్ అంశాలు కనుచూపు మేరలో కనిపించని ఈ తరహా కథలు ఒక వర్గం వారికి మాత్రమే నచ్చుతాయి.
స్వాతి అంటేనే గలగలమని మాట్లాడుతూ .. చక్రాల్లాంటి కళ్లను చకచకా తిప్పేస్తూ అల్లరి చేసే పాత్రల్లోనే ఆమెను ప్రేక్షకులు చూశారు. అలాంటి పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోవడం ఆమె ప్రత్యేకత. అలాంటి స్వాతిని వీల్ చైర్ కి పరిమితమైన పాత్రలో చూపించడం ఒక రకంగా మైనస్ అనే చెప్పుకోవాలి. అలా అని ఆ పాత్రలో ఆమె ఒదిగిపోలేదనుకుంటే పొరపాటే. దివ్య శ్రీపాదకి నేచురల్ బ్యూటీ అనే పేరు ఉంది. అందుకు తగిట్టుగానే ఆమె నటన ఉంది. ఇక సముద్రఖనిని కొత్త బాడీ లాంగ్వేజ్ లో చూపించిన తీరు కూడా కొత్తగానే అనిపిస్తుంది.
శ్రవణ్ భరద్వాజ్ - ప్రశాంత్ విహారి సంగీతం, రాజ్ కె నల్లి ఫొటోగ్రఫీ .. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ ఫరవాలేదు. థియేటర్ కి ఆడియన్స్ రప్పించే స్థాయి స్టార్స్ లేకపోవడం .. సినిమా స్థాయికి తగిన కంటెంట్ కాకపోవడం .. ఉన్న కథల్లో కథనం మందగించడం లోపాలుగా చెప్పుకోవచ్చు. ఏ వైపు నుంచి చూసినా ఇది వెబ్ సిరీస్ కి తగిన కంటెంట్ గానే అనిపిస్తూ ఉంటుంది. కమర్షియల్ అంశాలు ఏ మాత్రం తగ్గినా ఒప్పుకొని ఈ ట్రెండులో .. వాటికి దూరంగా రూపొందించిన ఈ సినిమా ఎంతవరకూ థియేటర్లలో నిలబడుతుందనేది చూడాలి.