ఎయిర్ పోర్ట్ మెట్రోకు కేసీఆర్ శంకుస్థాపన

  • రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్ట్ వరకు ఎక్స్ ప్రెస్ మెట్రో
  • మొత్తం ఖర్చును భరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • ప్రాజెక్టు పూర్తయితే 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు చేరుకునే అవకాశం
తెలంగాణ ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. మెట్రో రైల్ రెండో దశకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్-రాయదుర్గం కారిడార్ కు కొనసాగింపుగా దీన్ని నిర్మించనున్నారు. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు నిర్మించనున్న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు మైండ్ స్పేస్ వద్ద కేసీఆర్ భూమిపూజ చేశారు. ప్రత్యేక పూజలను నిర్వహించి పునాదిరాయి వేశారు.

ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 31 కిలోమీటర్ల మేర ఈ మెట్రో లైన్ ను నిర్మించనున్నారు. రూ. 6,250 కోట్ల అంచనాలతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. మూడేళ్లలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మెట్రో లైన్ నిర్మాణానికి మొత్తం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఎయిర్ పోర్టుకు 20 నిమిషాల్లోనే చేరుకునే అవకాశం ఉంటుంది.


More Telugu News