కూతురు పెళ్లికి హాజరై.. తండ్రికి పదవిని బహుమతిగా ఇచ్చిన సీఎం కేసీఆర్
- తెలంగాణ సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా రవీందర్ సింగ్
- ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ సోమేష్ కుమార్
- రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న రవీందర్
తమ పార్టీ నాయకుడి కుమార్తె వివాహానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు ఊహించని బహుమతి నిచ్చారు. మధ్యాహ్నం నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం.. సాయంత్రం వధువు తండ్రికి ముఖ్యమైన పదవి కట్టబెట్టారు. ఆ పదవి అందుకున్న వ్యక్తి టీఆర్ఎస్ సీనియర్ నేత, కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్. ఆయన తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం సీఎస్ సోమేష్‌కుమార్ జీవో జారీ చేశారు. మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం ముగిసిన అనంతరం గత ఏడాదిగా ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవీ ఖాళీగా ఉంది.
తాజాగా నియమితులైన రవీందర్ సింగ్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. కరీంనగర్ కు చెందిన సర్దార్ రవీందర్‌సింగ్ టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. గతంలో కరీంనగర్ మేయర్‌గా పనిచేశారు. గురువారం కరీంనగర్ లో జరిగిన రవీందర్ సింగ్ కుమార్తె పెళ్లి వేడుకకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అదే రోజు రవీందర్ ను పదవి వరించడం విశేషం.