సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివి: షర్మిల

  • ఉమ్మడి రాష్ట్రం కోరుకుంటున్నామన్న సజ్జల
  • సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన షర్మిల
  • రెండు రాష్ట్రాలూ కలవడం అసాధ్యమని స్పష్టీకరణ
  • విడిపోయిన రాష్ట్రాలను ఎలా కలుపుతారంటూ ట్వీట్
రాష్ట్ర విభజన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు స్పందించారు. సజ్జల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. సజ్జల వ్యాఖ్యలు అర్థం లేనివని పేర్కొన్నారు. 

నేడు తెలంగాణ ఒక వాస్తవం అని, ఎంతోమంది బలిదానాలు, ఎంతోమంది త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ అని వివరించారు. రెండు రాష్ట్రాలూ కలవడం అసాధ్యం అని షర్మిల స్పష్టం చేశారు. కొన్ని ఘటనలు చరిత్రలో ఒకేసారి జరుగుతాయి... విభజిత రాష్ట్రాలను మళ్లీ ఎలా కలుపుతారు? అని ప్రశ్నించారు. 

"మీరు ధ్యాస పెట్టాల్సింది రెండు రాష్ట్రాలను కలపడం మీద కాదు. మీ ప్రాంత అభివృద్ధి మీద ధ్యాస పెట్టాలి. మీ హక్కుల కోసం పోరాటం చేయండి, మీ ప్రాంతానికి న్యాయం చేయండి. అంతేకానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం మీకు తగదు" అని సజ్జలకు హితవు పలికారు.


More Telugu News