ఐదుగురు స్టార్స్ తో 'హిట్ 7' చేయడం సాధ్యమే: డైరెక్టర్ శైలేశ్ కొలను
- ఇటీవల థియేటర్స్ కి వచ్చిన 'హిట్ 2'
- హిట్ ఫ్రాంచైజీలో ఇంకా 5 భాగాలు ఉంటాయన్న డైరెక్టర్
- కథలో బలం ఉంటే అదే స్టార్స్ ను తీసుకొస్తుందంటూ వ్యాఖ్య
- థ్రిల్లర్ జోనర్ కి ఎమోషన్స్ కనెక్ట్ కాకపోతే కష్టమేనని వెల్లడి
అడివి శేష్ హీరోగా రీసెంట్ గా 'హిట్ 2' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఇంకా ప్రమోట్ చేయడంలోనే టీమ్ నిమగ్నమై ఉంది. 'హిట్' ఫ్రాంచైజీలో 7 భాగాలు ఉంటాయని ఇటీవల ఒక స్టేజ్ పై శైలేశ్ కొలను అన్నాడు. అప్పటి వరకూ ఈ ఫ్రాంచైజీలో చేస్తూ వచ్చిన ఐదుగురు స్టార్స్ తో 7వ భాగం చేస్తానని ఆయన అన్నాడు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదుగురు స్టార్స్ తో ఒక సినిమా చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్న శైలేశ్ కొలనుకు ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఐదుగురు స్టార్స్ ను ఒక చోటుకి చేర్చి సినిమా చేయడమనేది చాలా కష్టమైన పనే. కాకపోతే ఆ కష్టాన్ని ఇష్టంగా పడదామని నిర్ణయించుకున్నాను. కథలో విషయం ఉంటే స్టార్స్ ను అదే ఒప్పిస్తుందనేది నా నమ్మకం" అన్నాడు.
" మొదటి నుంచి కూడా నాకు థ్రిల్లర్ సినిమాలు అంటే ఇష్టం. ఆ సినిమాలనే ఎక్కువగా చూసేవాడిని. ఇక పోలీస్ డిపార్టుమెంటు అంటే కూడా నాకు చాలా ఇష్టం. అందువలన నేను ఈ జోనర్ ను ఎంచుకుని ఉండొచ్చని అనిపిస్తోంది. ఈ తరహా సినిమాల్లో లైన్ సింపుల్ గానే అనిపించినా, ఎమోషన్స్ ను .. డ్రామాను బ్యాలెన్స్ చేస్తూ నడిపించవచ్చు. అలా నడిపించాననే అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.