బ్రెస్ట్ కేన్సర్ ను జయించి షూటింగ్ కు హాజరైన హంసా నందిని

బ్రెస్ట్ కేన్సర్ ను జయించి షూటింగ్ కు హాజరైన హంసా నందిని
  • మళ్లీ జన్మించినట్టు ఉందన్న హంసా నందిని
  • ఇదంతా మీ అపార మద్దతు, ప్రేమ వల్లే సాధ్యమైందంటూ పోస్ట్
  • ఏడాది తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చిన నటి
అత్తారింటికి దారేదీ, మిర్చి సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో కనిపించి అదరగొట్టిన హంసా నందిని గుర్తుందా..? ఈ రెండే కాదు, ఎన్నో తెలుగు సినిమాల్లో నటించిన హంసా నందిని బ్రెస్ట్ కేన్సర్ బారిన పడడం తెలిసిందే. చికిత్సతో దీన్ని విజయవంతంగా అధిగమించిన హంసా నందిని తిరిగి సినిమాల్లో నటించడం మొదలు పెట్టింది. 

వంశపారంపర్యంగా ఆమె బ్రెస్ట్ కేన్సర్ బారిన పడడం గమనార్హం. 2021 డిసెంబర్ లో ఈ కఠిన నిజాన్ని ఇన్ స్టా గ్రామ్ పై ఆమె బయటపెట్టింది. తొమ్మిది సైకిల్స్ కీమోథెరపీ తీసుకున్నానని, మరో ఏడు సైకిల్స్ తీసుకోవాల్సి ఉన్నట్టు వెల్లడించింది. బుధవారం తిరిగి ఓ సినిమా షూటింగ్ కు హాజరైన హంసానందిని తన తాజా ఆరోగ్య స్థితిని వివరించింది. 

‘‘మూవీ సెట్లో ఉంటే మళ్లీ జన్మించిన అనుభూతి కలుగుతోంది. కెమెరా ముందు సజీవంగా ఉండే చోట నా పుట్టిన రోజు రావడం మంచి మార్గమని తెలుసు. ఈ రోజు రాత్రి నా తోటి నటులు, సినిమా సిబ్బందితో వేడుకలు జరుపుకుంటాను. మీ నుంచి అపార ప్రేమ, మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదు. నేను తిరిగి వచ్చేశా’’ అని హంసా పోస్ట్ పెట్టింది. 18 ఏళ్ల క్రితం తన తల్లిని కేన్సర్ పొట్టన పెట్టుకున్నట్టు హంసా నందిని లోగడ ప్రకటించడం తెలిసిందే. 


More Telugu News