హెడ్ సెట్ లో ఎయిర్ ప్యూరిఫయర్.. డైసన్ కొత్త ఆవిష్కరణ

  • చెవులు, ముక్కు, నోరు కప్పి ఉంచేలా డిజైన్
  • దీని ధర సుమారు రూ.78 వేలు
  • జనవరిలో చైనాలో విక్రయాలు
  • అమెరికా, బ్రిటన్, సింగపూర్ లో మార్చి నుంచి అమ్మకాలు
ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ డైసన్.. ఓ సరికొత్త ఆవిష్కరణను పరిచయం చేసింది. హెడ్ సెట్ అన్నది నేడు కనీస అవసరంగా మారింది. కార్యాలయాల్లో పనిచేస్తున్న సమయంలో అయినా, ఇంట్లో వినోద సమయంలోనూ దీని అవసరం ఉంటుంది. ఈ హెడ్ సెట్ కు ఎయిర్ ప్యూరిఫయర్ జోడించింది డైసన్. దీన్ని 2023 జనవరి నుంచి చైనాలో విక్రయించనుంది. ఇక అమెరికా మార్కెట్లోకి వచ్చే మార్చిలో ప్రవేశించనుంది. అలాగే, బ్రిటన్, ఐర్లాండ్, హాంగ్ కాంగ్, సింగపూర్ దేశాల్లోనూ మార్చిలో అందుబాటులోకి రానుంది.

డైసన్ జోన్ హెడ్ సెట్ ధర సుమారు 949 డాలర్లు. అంటే మన రూపాయిల్లో రూ.78వేలు ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో హెడ్ సెట్ ఉంటుంది. పట్టణాల్లో శబ్ద కాలుష్యం ఎక్కువన్న సంగతి తెలిసిందే. ఈ హెడ్ సెట్ ధరిస్తే శబ్ద కాలుష్యం నుంచి రక్షణ లభిస్తుంది. అంతేకాదు పట్టణాల్లో వాయు కాలుష్యం కూడా ఎక్కువే. ఆ విధంగానూ ఈ హెడ్ సెట్ ఎయిర్ ప్యూరిఫయర్ రూపంలో రక్షణ ఇవ్వనుంది.

ఈ హెడ్ సెట్ లోని మైక్రో ఫోన్లు చుట్టూ ఉన్న శబ్దాలను ఒక సెకనులో 3,84,000 సార్లు వినగలవని డైసన్ చెబుతోంది. మన దేశంలో వాయు, శబ్ద కాలుష్యం అధికంగా ఉన్న ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగర వాసులకు ఇది ఎంతో ఉపయక్తంగా ఉంటుంది. హెడ్ సెట్ కు ముందు భాగంలో ముక్కు, నోరు కప్పి ఉంచేలా డైసన్ ఎయిర్ ప్యూరిఫయర్ హెడ్ సెట్ ఉంటుంది. దీంతో గాలిని తీసుకున్నప్పుడు అది ఫిల్టరై లోపలికి వస్తుంది.


More Telugu News