సుప్రీంకోర్టులో పెండింగ్ కేసులను ట్రాక్ చేసేందుకు మొబైల్ యాప్ 2.0

  • ప్రారంభించినట్టు ప్రకటించిన ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్
  • న్యాయాధికారులు, ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేసేందుకు వీలు
  • గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులోకి యాప్    
భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో మొబైల్ యాప్ 2.0ని ప్రారంభించినట్లు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రకటించారు. న్యాయాధికారులు, ప్రభుత్వ విభాగాలు తమ కేసులను ట్రాక్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. ఈ కొత్త వెర్షన్ యాప్ తో ప్రభుత్వ శాఖలు తమ పెండింగ్ కేసులను చూడవచ్చని ఆయన తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్ లో యాప్ 2.0 అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇక ఐఓఎస్ వినియోగదారుల కోసం వారం రోజుల్లో యాప్ అందుబాటులోకి వస్తుందని చంద్రచూడ్ ప్రకటించారు. 

అదనపు ఫీచర్లతో యాప్ ను తయారు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీన్ని ఉపయోగించి న్యాయాధికారులు, వివిధ కేంద్రమంత్రిత్వ శాఖలకు చెందిన నోడల్ ఆఫీసర్లు తమ కేసులను ట్రాక్ చేసుకునేందుకు వీలు ఉంటుందన్నారు. నోడల్ అధికారులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కేసులు, స్టేటస్ ఆర్డర్ లు, తీర్పులు, దాఖలు చేసిన ఏవైనా ఇతర పత్రాలను.. యాప్ లోకి వెళ్లి పరిశీలించవచ్చని తెలిపారు.


More Telugu News