క్రిప్టో కంటే కూడా మీ పర్ఫామెన్స్ వేగంగా పడిపోతోంది: వీరేంద్ర సెహ్వాగ్

  • బంగ్లాదేశ్ తో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన భారత్
  • టీమిండియాపై వెల్లువెత్తుతున్న విమర్శలు
  • ఇకనైనా మేలుకోవాలని సెహ్వాగ్ వ్యాఖ్య
టీమిండియా ఫామ్, వరుస పరాజయాలపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించారు. క్రిప్టో కరెన్సీ కంటే కూడా వేగంగా మీ పర్ఫామెన్స్ పడిపోతోందని విమర్శించారు. మారాల్సిన అవసరం ఉందని... ఇకనైనా మేలుకోవాలని సూచించారు. బంగ్లాదేశ్ తో 2-0 తేడాతో టీమిండియా సిరీస్ ను కోల్పోయిన నేపథ్యంలో సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

టీ20 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్స్ లో భారత జట్టు వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్ కు జట్టును మళ్లీ బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే, వెంటనే బంగ్లాదేశ్ తో జరుగుతున్న సిరీస్ లో భారత్ దారుణమైన ప్రదర్శన చేయడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్ బ్యాటింగ్ తీరు ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ చేతి వేలి గాయంతోనే 28 బంతుల్లో 51 పరుగులతో చెలరేగిపోయినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. మ్యాచ్ చివర్లో బ్యాటింగ్ కు దిగిన రోహిత్ వీరోచిత పోరాటం వృథా అయిపోయింది.


More Telugu News