బాసర ఆలయంలో అక్షరాభ్యాసం.. ఆన్ లైన్ లో టికెట్ల ధరలివి..!
- ఆన్ లైన్ లో టికెట్ ధర రూ.1,516.. విదేశీయులకు రూ.2,516
- అమ్మవారికి పూజ చేసిన వస్తువులను పోస్ట్ లో పంపించే ఏర్పాట్లు
- ఆలయంలో భక్తుల రద్దీ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారుల వెల్లడి
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం టికెట్లను అధికారులు ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చారు. ఆలయంలో రద్దీ, టికెట్ కోసం గంటల తరబడి క్యూలో నిలుచునే ఇబ్బందిని తప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. చిన్నారులను స్కూలుకు పంపించే ముందు అక్షరాభ్యాసం చేయించాలని దేశం నలుమూలల నుంచి తల్లిదండ్రులు బాసర సరస్వతి ఆలయానికి వస్తుంటారు. నిత్యం వందలాది మంది భక్తులు ఆలయ సందర్శనకు వస్తుంటారు. ఏటా దాదాపు 80,000 నుంచి 1,00,000 మంది బాసర ఆలయం ప్రాంగణంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు.
ఈ నేపథ్యంలో ఆలయంలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడుతుండడంతో అక్షరాభ్యాసం టికెట్లను దేవాదాయ శాఖ ఆన్ లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అక్షరాభ్యాసం కోసం ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకుంటే రూ.1,516 చెల్లించాల్సి ఉంటుంది. ఇక విదేశీయులకు టికెట్ ధరను రూ.2,516 గా దేవాదాయ శాఖ నిర్ణయించింది. పోస్ట్ ద్వారా పూజ చేసిన వస్తువులను పంపించే ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. విదేశాల్లో ఉన్నవారికి కూడా పంపిస్తామని వివరించారు.