కంటెంట్ ఉంటే చాలు అంటున్న బన్నీ వాసు!
- విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'ముఖచిత్రం'
- గౌరవ అతిథులుగా వచ్చిన మారుతి - బన్నీవాసు
- కథలో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందన్న మారుతి
- కంటెంట్ కి జనాలు పట్టం కడుతున్నారన్న బన్నీ వాసు
వికాస్ వశిష్ఠ - ప్రియా వడ్లమాని జంటగా 'ముఖ చిత్రం సినిమా రూపొందింది. సందీప్ రాజ్ నిర్మించిన ఈ సినిమాకి గంగాధర్ దర్శకత్వం వహించాడు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చాడు. సునీల్ కీలకమైన పాత్రను .. విష్వక్ సేన్ ప్రత్యేకమైన పాత్రను పోషించగా, ఇతర పాత్రల్లో రవిశంకర్ .. చైతన్యరావు కనిపించనున్నారు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించారు.
గౌరవ అతిథిగా వచ్చిన బన్నీ వాసు ఈ వేదికపై మాట్లాడుతూ .. "ఈ మధ్య స్టార్స్ ను బట్టి కాకుండా కథాబలాన్ని బట్టి జనాలు థియేటర్స్ కి వస్తున్నారు. అలాంటి కథాబలం 'ముఖచిత్రం' సినిమాకి హండ్రెడ్ పర్సెంట్ ఉంది. చివరి 20 నిమిషాలను నడిపించిన తీరు గొప్పగా ఉంది. చిన్న పాత్రనే అయినా విష్వక్ చేసిన పాత్ర ఈ సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ అవుతుంది" అన్నారు.
ఇక మారుతి మాట్లాడుతూ .. "ఈ సినిమాను నాకు చూపించారు .. చూస్తూ చాలా ఎగ్జైట్ అయ్యాను. పెద్ద కాన్సెప్టును .. చిన్న కాస్టింగ్ తో గొప్పగా ప్రెజెంట్ చేయడం ఈ సినిమా ప్రత్యేకత. ఈ సినిమాలో ఇంతటి ఇంట్రస్టింగ్ పాయింట్ ఉందనే విషయం థియేటర్లోకి వచ్చిన తరువాతనే అర్థమవుతుంది. ఆర్టిస్టులంతా కథలో ఒదిగిపోయారు. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయాన్ని సాధిస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు.