ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఒక చిన్న పార్టీ చేతిలో ఓడిపోయింది: ఆప్ నేత రాఘవ్ చద్దా
- ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయం
- బీజేపీకి ప్రతికూల ఫలితం
- సంబరాల్లో ఆప్ శ్రేణులు
- ఢిల్లీ వాసులు అభివృద్ధికి పట్టం కట్టారన్నా రాఘవ్
ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల్లో విజయం సాధించడం పట్ల ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా స్పందించారు. ఆప్ ను పేద, నిజాయతీ కలిగిన పార్టీగా అభివర్ణించారు. అదే సమయంలో అపార శక్తి, సీఎంలు, దర్యాప్తు సంస్థల అండ ఉన్న పార్టీగా బీజేపీని పేర్కొన్నారు. కానీ, విద్యావంతమైన చిన్న పార్టీ చేతిలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బీజేపీ ఓడిపోయిందని రాఘవ్ చద్దా ఎద్దేవా చేశారు.
ఈ హోరాహోరీ పోరులో ఏడుగురు సీఎంలు, పదిహేడు మంది కేంద్రమంత్రులు, వంద మంది ఎంపీలు, ఈడీ, సీబీఐ, ఐటీ శాఖలతో పాటు జైల్లో ఉన్న ఓ వ్యక్తి (సుఖేశ్ చంద్రశేఖర్) కూడా వారి ప్రధాన ప్రచారకర్తలు అని పేర్కొన్నారు.
కేజ్రీవాల్ ఓటమికి ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఢిల్లీ ప్రజానీకం మాత్రం ఆప్ వెంటే నిలిచారని అన్నారు. చివరికి సామాన్యుడే గెలిచాడని వ్యాఖ్యానించారు. ఢిల్లీ వాసులు అభివృద్ధికే పట్టం కట్టారని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. కేజ్రీవాల్ పై బీజేపీ చల్లుతున్న బురదను ఈ ఎన్నికలతో ఢిల్లీ వాసులు తుడిచేశారని వివరించారు.