స్టేజ్ పై ఏడ్చేసిన శివాత్మిక రాజశేఖర్!
- ఐదు కథల కలయికగా 'పంచతంత్రం'
- కొంతసేపటి క్రితం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- 'లేఖ' పాత్ర తనకి పేరు తెస్తుందన్న శివాత్మిక
- ఈ నెల 9వ తేదీన విడుదలవుతున్న సినిమా
వైవిధ్యభరితమైన కథాకథనాలతో రూపొందిన 'పంచతంత్రం' విడుదలకు ముస్తాబవుతోంది. సృజన్ - అఖిలేశ్ నిర్మించిన ఈ సినిమాకి హర్ష పులిపాక దర్శకత్వం వహించాడు. బ్రహ్మానందం .. సముద్రఖని .. స్వాతి రెడ్డి .. శివాత్మిక రాజశేఖర్ .. రాహుల్ విజయ్ .. దివ్య శ్రీపాద ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదులో నిర్వహిచారు.
ఈ వేడుకకి జీవిత రాజశేఖర్ - హరీశ్ శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ స్టేజ్ పై శివాత్మిక మాట్లాడుతూ .. "దర్శకుడు హర్ష నాకు కథ చెబుతున్నప్పుడే నేను ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. 'నువ్వు ఈ సినిమా చేస్తున్నావు' అంటూ నేను ఆ క్షణమే ఒప్పుకునేలా చేశారు. నాపై అంత నమ్మకం ఉంచినందుకు హ్యాపీగా ఉంది" అంది.
"ఈ సినిమాలో నేను పోషించిన 'లేఖ' పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలో ఐదు కథలను చూస్తుంటే .. ఐదు సినిమాలను చూస్తున్నట్టుగా ఉంటుంది. బ్రహ్మానందం .. స్వాతి వంటి ఆర్టిస్టులతో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాతో మా అందరికీ సక్సెస్ రావాలి .. అందువలన ఈ సినిమా తప్పకుండా ఆడాలండీ బాబూ" అంటూ ఏడ్చేసింది.