డిసెంబరు 16న విడుదలవుతున్న అరుణ్ విజయ్ 'ఆక్రోశం'
- తమిళంలో రివెంజ్ డ్రామగా తెరకెక్కిన సినం
- తెలుగులో ఆక్రోశంగా వస్తున్న చిత్రం
- అరుణ్ విజయ్, పల్లక్ లల్వానీ జంటగా చిత్రం
- జీఎన్ కుమార వేలన్ దర్శకత్వం
- హైదరాబాదులో ప్రమోషన్ ఈవెంట్
వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అరుణ్ విజయ్ హీరోగా రూపొందిన చిత్రం 'ఆక్రోశం'. ఇందులో అరుణ్ విజయ్ సరసన పల్లక్ లల్వాని కథానాయికగా నటించారు.
యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్, ఎమోషనల్ రివెంజ్ డ్రామా జానర్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘సినం’ను తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో తీసుకువస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్, మూవీ స్లయిడర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై జీఎన్ కుమార వేలన్ డైరెక్షన్‌లో ఈ చిత్రం తెరకెక్కింది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ఆర్.విజయ్ కుమార్, సీహెచ్ సతీష్ కుమార్ నిర్మాతలు.
'ఆక్రోశం' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో చిత్రబృందం హైదరాబాదులో ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత సతీష్ కుమార్ మాట్లాడుతూ ‘ఆక్రోశం' మూవీ... తల్లి, తండ్రి, భర్త, భార్య, కొడుకు... ఇలా కుటుంబంలోని అన్ని ఎమోషన్స్‌ను సమానంగా చూపిస్తూ అందరూ కలిసి చూసే విధంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్స్‌తో చర్చించామని, సినిమా అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో రిలీజ్ డేట్‌ను డిసెంబర్ 16కు మార్చినట్టు వెల్లడించారు.
హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ, డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న ‘ఆక్రోశం’ సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని ఎగ్జయిటింగ్‌గా ఉందని తెలిపారు.
నిజానికి డిసెంబర్ 9న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను డిసెంబర్ 16న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నామని వెల్లడించారు. అందుకు కారణం... ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనేదే మా ఆలోచనని, వీలైనన్ని ఎక్కువ థియేటర్స్‌లో మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాం అని వివరించారు.
'ఆక్రోశం' చిత్రంలో కాళీ వెంకట్, ఆర్.ఎన్.ఆర్. మనోహర్, కె.ఎస్.జి. వెంకటేశ్, మరుమలార్చి భారతి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు షబీర్ తబరే ఆలం సంగీతం అందించారు. గోపీనాథ్ సినిమాటోగ్రఫీ అందించారు.