రెండో వన్డేలో అదరగొడుతున్న భారత బౌలర్లు
- వరుసగా వికెట్లు తీసిన సిరాజ్, ఉమ్రాన్, సుందర్
- నిరాశ పరిచిన బంగ్లా టాపార్డర్ బ్యాటర్లు
- తొలి వన్డేలో చిత్తుగా ఓడిన భారత్
మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో అనూహ్యంగా ఓడిపోయిన భారత జట్టు రెండో మ్యాచ్ లో పంజా విసురుతోంది. మీర్పూర్ లోని షేర్ ఎ బంగ్లా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగి ఆడుతూ బంగ్లా బ్యాటర్ల పని పడుతున్నారు. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ కోల్పోయినప్పటికీ భారత్ బౌలింగ్ లో చెలరేగిపోయింది. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ కు తోడు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వరుస వికెట్లు పడగొట్టారు.
ఓపెనర్లు అనాముల్ హక్ (11), లిటన్ దాస్ (7) ఇద్దరినీ సిరాజ్ ఔట్ చేశాడు. కాసేపు పోరాడిన నజ్ముల్ హుస్సేన్ శాంటో (21)ను ఉమ్రాన్ మాలిక్ క్లీన్ బౌల్డ్ చేశాడు. షకీబ్ అల్ హసన్ (8), ముష్ఫికర్ రహీం (12), అఫిఫ్ హుస్సేన్ (0)లను వాషింగ్టన్ సుందర్ వెనక్కి పంపించాడు. దాంతో, బంగ్లా 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం 23 ఓవర్లకు 89/6 స్కోరుతో నిలిచింది. మహ్మదుల్లా 12... మెహిదీ హసన్ మిరాజ్ 10 పరుగులతో అజేయంగా నిలిచారు.