ఆ సినిమా షూటింగ్ లో వరుస చెంపదెబ్బలు తినడంతో ఇక నా పనైపోయిందనుకున్నా: శక్తికపూర్
- మవాలి సినిమా సందర్భంగా మూడు సార్లు చెంపదెబ్బలు తిన్న శక్తికపూర్
- ఇక కెరీర్ ముగించి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్న నటుడు
- వీరు దేవగణ్ సూచనతో ఆ ఆలోచన విరమణ
బాలీవుడ్ సీనియర్ నటుడు అయిన శక్తి కపూర్ తన కెరీర్ మొదట్లో చోటు చేసుకున్న ఓ బాధాకర ఘటనను కపిల్ శర్మ షో సీజన్ 3లో భాగంగా పంచుకున్నారు. ఓ దశలో ఆయన నటన నుంచి వెళ్లిపోవాలని అనుకున్నట్టు చెప్పారు. అంతటి తీవ్ర అభిప్రాయాన్ని కలిగించిన ఆ ఘటన వివరాలను పరిశీలిస్తే..
‘‘సత్తే పే సత్తా తర్వాత 1983లో మవాలి సినిమాలో చేశాను. సినిమాలో నా మొదటి షాట్ సమయంలో ఖాదర్ ఖాన్ నా చెంప చెళ్లుమనిపించారు. దీంతో నేను కింద పడిపోయాను. రెండో షాట్ లో అరుణ ఇరాని నా చెంపై కొట్టడంతో అప్పుడు కూడా కింద పడిపోయాను. ఆ తర్వాత మూడో సారి కూడా అదే జరిగింది’’ అని శక్తికపూర్ వెల్లడించారు. దీంతో తీవ్ర నిరుత్సాహానికి గురైన శక్తికపూర్, తన కెరీర్ ఇక ముగిసినట్టేనని అనుకున్నట్టు చెప్పారు.
‘‘కె.బాపయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఖాదర్ ఖాన్ కూడా అందులో నటిస్తున్నారు. నేను నేరుగా ఖాదర్ ఖాన్ దగ్గరకు వెళ్లాను. నేను మీ కాళ్లపై పడతాను. నాకు సాయంత్రం టికెట్ బుక్ చేయండి. ఈ సినిమాలో నేను ఇక ఎంత మాత్రం నటించాలని అనుకోవడం లేదు. నా కెరీర్ ముగిసింది. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు’’ అని అన్నట్టు శక్తికపూర్ వివరించారు. కాకపోతే వీరు దేవగణ్ సూచనతో సినీ పరిశ్రమలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.