టీమిండియాకు స్లో ఓవర్ రేట్ జరిమానా

  • బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో భారత్ ఓటమి
  • నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా విసిరిన భారత్
  • 80 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా
బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో ఓడిపోయిన టీమిండియాకు స్లో ఓవర్ రేట్ జరిమానా పడింది. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయలేదన్న కారణంగా టీమిండియా మ్యాచ్ ఫీజులో 80 శాతం జరిమానాగా విధించారు.

భారత జట్టు నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేసినట్టు మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగళే గుర్తించారు. ఇది ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం తప్పిదం. ఒక ఓవర్ కు 20 శాతం చొప్పున మ్యాచ్ ఫీజులో కోత విధిస్తారు. ఆ లెక్కన టీమిండియా నిర్ణీత సమయానికి 4 ఓవర్లు తక్కువగా బౌలింగ్ చేయడంతో 80 శాతం మ్యాచ్ ఫీజు కోత విధించారు. 

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తప్పిదాన్ని అంగీకరించడంతో తదుపరి విచారణ అవసరంలేకుండా జరిమానాతో సరిపెట్టారు.


More Telugu News