గుజరాత్ లో మళ్లీ బీజేపీనే... ఎగ్జిట్ పోల్స్ ఇవిగో!

  • నేటితో ముగిసిన గుజరాత్ ఎన్నికల పోలింగ్
  • సందడి చేస్తున్న ఎగ్జిట్ పోల్స్
  • 100కి పైగా స్థానాల్లో కమల వికాసం 
  • రెండో స్థానంలో కాంగ్రెస్
  • ఆప్ కు నిరాశేనంటున్న ఎగ్జిట్ పోల్స్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సంరంభం ముగిసింది. ఈ నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంనాలు వెలువడ్డాయి. 1995 నుంచి గుజరాత్ లో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న బీజేపీకి ఈసారి గట్టిపోటీ తప్పదని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో 99 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ... ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ తో పాటు కొత్తగా ఆప్ రూపంలోనూ పోటీని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. 

గుజరాత్ అసెంబ్లీలో మొత్తం స్థానాలు 182 కాగా, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇలా ఉన్నాయి....

పీ-మార్క్వీ ఎగ్జిట్ పోల్స్...

బీజేపీ: 128-148
కాంగ్రెస్: 30-42
ఆప్: 2-10
ఇతరులు: 0-3

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్...

బీజేపీ: 117-140
కాంగ్రెస్: 34-51
ఆప్: 6-13
ఇతరులు: 1-2

టీవీ9 ఎగ్జిట్ పోల్స్...

బీజేపీ: 125-130
కాంగ్రెస్: 30-40
ఆప్: 3-5
ఇతరులు: 3-7

ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్స్...

బీజేపీ: 98-110
కాంగ్రెస్: 66-71
ఆప్: 9-14

రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్...

బీజేపీ: 128-148
కాంగ్రెస్: 30-42
ఆప్: 2-10

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్...

బీజేపీ: 125-143
కాంగ్రెస్: 30-48
ఆప్: 3-7

మొత్తమ్మీద ఎగ్జిట్ పోల్స్ పరిశీలిస్తే గుజరాత్ లో బీజేపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 100కి పైగా సీట్లు గెలుచుకుంటుందని ఆయా మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. గుజరాత్ లో కాంగ్రెస్ మరోసారి రెండో స్థానానికి పరిమితం అవుతుందని, ఆప్ కు నిరాశ తప్పదని ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. అటు, హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి గట్టిపోటీ తప్పదని ఎగ్జిట్ పోల్స్ వివరిస్తున్నాయి.


More Telugu News