నీటిపై వేగంగా నడిచిన పెద్ద తొండ.. వీడియో ఇదిగో

  • వీడియోను షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి నందా
  • నీటి అణువులు ఒక్కటైనప్పుడు జంతువులు సునాయాసంగా నడవొచ్చని పోస్ట్
  • వైరల్ గా మారిన వీడియో
పరిశీలించి చూస్తే ఈ ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. కోట్లాది ప్రాణుల్లో ఎన్నో ప్రత్యేకతలు గోచరిస్తాయి. ప్రముఖ ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా మరో వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్ పై పోస్ట్ చేశారు. తొండ జాతికి చెందిన ఓ జీవి నీటిపైకి అమాంతం దూకేసి అవతలి ఒడ్డుకు రెండు కాళ్లపై వేగంగా నడుస్తూ చేరుకోవడాన్ని ఇందులో చూడొచ్చు. 

‘‘నీటి అణువులు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు సృష్టించబడే శక్తి ప్రబలంగా ఉంటుంది. అప్పుడు చిన్న జంతువులు నీటి ఉపరితలంపై సునాయాసంగా నడుచుకుంటూ వెళ్లొచ్చు’’ అని సుశాంత నందా ఈ వీడియోతోపాటు పోస్ట్ చేశారు. ఈ వీడియో పట్ల నెటిజన్లు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి తన అందాలను ప్రపంచానికి ఎప్పుడూ చూపిస్తూనే ఉంటుందని ఓ ట్విట్టర్ యూజర్ కామెంట్ చేశారు.


More Telugu News