ఫిఫా ప్రపంచ కప్ లో పీలే 60 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఫ్రాన్స్ స్టార్
- ప్రపంచ కప్ టోర్నీల్లో ఇప్పటికే తొమ్మిది గోల్స్ చేసిన కిలియన్ ఎంబాపె
- 24 ఏళ్ల వయసులోపే 8 అంతకంటే ఎక్కువ గోల్స్ చేసిన ఆటగాడిగా చరిత్ర
- ప్రీ క్వార్టర్ ఫైనల్లో పోలెండ్ ను చిత్తు చేసిన ఫ్రాన్స్
ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్ నాకౌట్ మ్యాచ్‌లు రికార్డులతో హోరెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ప్రీక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబాపె డబుల్ గోల్స్ తో చెలరేగాడు. ఈ టోర్నీలో అతను ఇప్పటికే ఐదు గోల్స్ కొట్టాడు. గత టోర్నీలో నాలుగు సాధించాడు. దాంతో, ప్రపంచ కప్ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా, పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో (చెరో 8 గోల్స్)ను అధిగమించారు. అంతేకాదు అతను బ్రెజిల్ దిగ్గజం పీలే పేరిట 60 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న మరో రికార్డును సైతం బ్రేక్ చేశారు.
24 ఏళ్లలోపే ప్రపంచ కప్ టోర్నీల్లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అతను చరిత్ర సృష్టించాడు. తన కెరీర్లో బ్రెజిల్ కు మూడు ప్రపంచ కప్స్ అందించిన పీలే 24 ఏళ్లలోపు ఏడు గోల్స్ సాధించాడు. ఈ రికార్డు 60 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉంది. ఇప్పుడు ఎంబాపె 23 ఏళ్లకే తొమ్మిది గోల్స్ తో కొత్త చరిత్ర సృష్టించాడు. అతనితో పాటు ఒలివర్ గిరౌడ్ కూడా ఓ గోల్ సాధించడంతో ప్రిక్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ 3–1తో పోలెండ్ జట్టును ఓడించింది. ఒలివర్ గిరౌడ్ 44వ నిమిషంలో గోల్ సాధించగా.. ఎంబాపె 74, 90 1వ నిమిషాల్లో రెండు గోల్స్ రాబట్టాడు. పోలెండ్ తరఫున రోబెర్ట్ లావెండోవ్ స్కీ అదనపు సమయం తొమ్మిదో నిమిషంలో ఏకైక గోల్ అందించాడు.