గుజరాత్‌లో ప్రారంభమైన రెండో విడత ఎన్నికల పోలింగ్

  • 14 రాష్ట్రాల్లోని 93 స్థానాలకు ప్రారంభమైన పోలింగ్
  • బరిలో 833 మంది అభ్యర్థులు
  • ఓటు హక్కు వినియోగించుకోనున్న 2.5 కోట్ల మంది ఓటర్లు
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఈ విడతలో 14 రాష్ట్రాల్లోని 93 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2.5 కోట్ల మంది ఓటర్లు.. 833 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నారు. రాష్ట్రంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

ఇక ఈ విడతలో అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆప్ మొత్తం 93 స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 90, దాని మిత్రపక్షమైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రెండు స్థానాల్లో బరిలోకి దిగాయి. గుజరాత్‌లో తొలి విడత ఎన్నికలు ఈ నెల 1న జరిగాయి. 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ కోసం మొత్తం 26,409 పోలింగ్ స్టేషన్లను, దాదాపు 36 వేల ఈవీఎంలను ఏర్పాటు చేశారు. వీటిలో 93 మోడల్ పోలింగ్ స్టేషన్లు, 93 ఎకో ఫ్రెండ్లీ బూత్‌లు ఉన్నాయి.


More Telugu News