ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక పోరాటం... మహిళలపై మొరాలిటీ పోలీస్ ఎత్తివేసిన ప్రభుత్వం

  • ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక పోరాటం
  • రెండు నెలలుగా నిరసన జ్వాలలు
  • రోడ్లపైకి వచ్చిన మహిళలు
  • వెనుకంజ వేసిన ప్రభుత్వం
ఇరాన్ లో గత రెండు నెలలుగా మహిళలు హిజాబ్ వ్యతిరేక పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. హిజాబ్ లేని మహిళలను గుర్తించేందుకు ఇరాన్ లో తీవ్రస్థాయిలో మొరాలిటీ పోలీస్ (నైతికత పోలీసు విభాగం) తనిఖీలు చేపట్టారు. 

హిజాబ్ లేకుండా కనిపించిన మహ్సా అమిని అనే మహిళను అరెస్ట్ చేయగా, కొన్ని రోజుల తర్వాత ఆమె మరణించింది. దాంతో ఇరాన్ లో ప్రజాగ్రహం భగ్గుమంది. మహిళలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దేశవ్యాప్త నిరసనల సందర్భంగా జరిగిన హింసలో 300 మంది వరకు మరణించారు. అయినప్పటికీ మహిళల పోరాటం ఆగలేదు. 

ఈ నేపథ్యంలో, ఇరాన్ ప్రభుత్వం వెనుకంజ వేసింది. మహిళల హిజాబ్ వ్యతిరేక పోరాటానికి తలొగ్గి మోరల్ పోలీసింగ్ ను ఎత్తివేసింది. హిజాబ్ ను తనిఖీ చేసే మొరాలిటీ పోలీస్ విధానాన్ని రద్దు చేసింది. ఈ నైతికత పోలీసులకు ఇరాన్ న్యాయవ్యవస్థతో సంబంధం లేదని, ఈ వ్యవస్థను తొలగిస్తున్నామని ఇరాన్ అటార్నీ జనరల్ మహ్మద్ జాఫర్ మోంటాజెరి వెల్లడించారు.


More Telugu News