ఇండిగో ఎయిర్ లైన్స్ వల్ల చెత్త అనుభవం ఎదురైంది: రానా దగ్గుబాటి
- హైదరాబాదు నుంచి బెంగళూరు వెళ్లిన రానా ఫ్యామిలీ
- షెడ్యూల్డ్ ఫ్లయిట్ లో కాకుండా మరో విమానంలో పయనం
- అదే విమానంలో లగేజి తరలించని విమాన సిబ్బంది
- రానా ఆగ్రహం
టాలీవుడ్ అగ్ర నటుడు రానా దగ్గుబాటి ఇండిగో ఎయిర్ లైన్స్ సేవలపై తీవ్ర విమర్శలు సంధించారు. భారత్ లో అత్యంత చెత్త విమానయాన అనుభవం అంటూ ఇండిగో ఎయిర్ లైన్స్ ను ఉద్దేశించి ట్వీట్లు చేశారు.
అసలేం జరిగిందంటే... ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి రానా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే షెడ్యూల్డ్ ఫ్లయిట్ కాకుండా మరో విమానంలో వెళ్లాలని సిబ్బంది సూచించారు. లగేజి కూడా అదే విమానంలో వస్తుందని తెలిపారు. వారు చెప్పినట్టే రానా కుటుంబం బెంగళూరు వెళ్లింది. కానీ లగేజి మాత్రం రాలేదు. దాంతో రానా ఆగ్రహం వ్యక్తం చేశారు.
విమానాశ్రయ సిబ్బంది కూడా సరైన వివరణ ఇవ్వకపోవడంతో ఉన్నతాధికారులను కూడా రానా ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, ట్విట్టర్ లో ఇండిగో ఎయిర్ లైన్స్ ను ఆయన టార్గెట్ చేశారు.
విమానాలు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు వెళతాయో తెలియదు... మిస్సయిన లగేజిని ఎలా కనుగొనాలో తెలియదు, ఈ విషయాలు సిబ్బందికే తెలియదు అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు, ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రచార పోస్టులపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి రానాకు మద్దతు లభించింది. గతంలో తమకు విమాన ప్రయాణాల్లో ఎదురైన అనుభవాలను వారు రానాతో పంచుకున్నారు.