రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పట్టుచీరను బహూకరించిన వైఎస్ భారతి
- ఏపీలో పర్యటిస్తున్న రాష్ట్రపతి
- పోరంకిలో ఘన సన్మానం
- రాష్ట్రపతిని కలిసిన వైఎస్ భారతి
ఏపీలో పర్యటిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ సీఎం జగన్ అర్ధాంగి వైఎస్ భారతి ఓ కానుక ఇచ్చారు. పోరంకిలో నిర్వహించిన ముర్ము సన్మాన కార్యక్రమానికి వైఎస్ భారతి కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రపతికి ఓ విశిష్టమైన పట్టుచీరను బహూకరించారు. ఆ కానుక అందుకున్న రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. వైఎస్ భారతికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ కూడా అక్కడే ఉన్నారు. సీఎం జగన్, వైఎస్ భారతి ఓ చిత్రపటాన్ని కూడా రాష్ట్రపతికి బహూకరించారు.
కాగా, ఇవాళ నేవీ డే సందర్భంగా విశాఖ తీరంలో నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ చేరుకున్నారు. విశాఖలో ఆమెకు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రభుత్వం తరఫున స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ద్రౌపది ముర్ము నగరంలోని ఆర్కే బీచ్ కు తరలి వెళ్లారు. ఆమె వెంట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్రమంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా తరలి వెళ్లారు.
ఆర్కే బీచ్ లో ఈ సాయంత్రం నిర్వహించనున్న నేవీ డే విన్యాసాలను ద్రౌపది ముర్ము తిలకించనున్నారు.