ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం విచారణలో ఈడీ దూకుడు

  • మాజీ చైర్మన్, డైరెక్టర్ సహా 26 మందికి నోటీసులు
  • రేపటి నుంచి ఒక్కొక్కరిగా విచారించనున్న అధికారులు
  • రూ.234 కోట్ల నిధుల మళ్లింపులపై కేసు నమోదు చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా రూ.234 కోట్ల నిధుల మళ్లింపునకు సంబంధించి కేసు నమోదు చేసింది. పలు షెల్ కంపెనీల సాయంతో నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ అనుమానిస్తుంది. ఈ నిధుల మళ్లింపు వ్యవహారంపై విచారణకు హాజరుకావాలంటూ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, మాజీ చైర్మన్ గంటా సుబ్బారావులతో పాటు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసింది. సోమవారం హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులలో సూచించింది.

స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో నిరుద్యోగులకు శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన కోసం గతంలో చంద్రబాబు  ప్రభుత్వం విడుదల చేసిన నిధులు దుర్వినియోగం అయ్యాయని  భావించిన జగన్  సర్కార్   సీఐడీకి విచారణను అప్పగిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో మనీలాండరింగ్ కోణం ఉందని భావించిన  సీఐడీ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు సమాచారం అందించారు. దీంతో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాంపై ఈడీ దృష్టి సారించింది.  తాజాగా ఆయా కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.


More Telugu News