వన్ ప్లస్ నుంచి మరో బడ్జెట్ ఫోన్
- నార్డ్ సీఈ 3 పేరుతో మార్కెట్లోకి తీసుకురానున్న కంపెనీ
- 108 మెగా ఫిక్సెల్ రియర్ కెమెరా ప్రత్యేక ఆకర్షణ
- మొబైల్ ఫోన్ ఫీచర్లు ఆన్ లైన్ లో లీక్
బడ్జెట్ ఫోన్ ల కేటగిరీలో వన్ ప్లస్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను తీసుకురానుంది. వచ్చే ఏడాది లాంచ్ చేయనున్న ఈ మొబైల్ ఫోన్ లో కెమెరాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ వివరాలపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.. అయితే, ఫోన్ ఫీచర్లకు సంబంధించిన వివరాలు మాత్రం ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. చైనా కంపెనీ వన్ ప్లస్ నుంచి రాబోయే కొత్త బడ్జెట్ ఫోన్ ఇదేనంటూ ప్రచారం జరుగుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.25 వేల వరకు ఉంటుందని అంచనా.
నార్డ్ సీఈ 2 కు కొనసాగింపుగా నార్డ్ సీఈ 3 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ లో రియర్ కెమెరా 108 మెగా పిక్సెల్ ఉంటుందని సమాచారం. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగా పిక్సెల్ సామర్థ్యంతో పనిచేస్తుంది. బ్లాక్ ఫినిష్‌తో కూడిన హోల్ పంచ్ డిస్‌ప్లేతో వన్‌ప్లస్ ఎక్స్ డిజైన్ ఆధారంగా వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 డిజైన్ ఉంటుంది.
మిగతా ఫీచర్లు..

- 6.7 ఇంచుల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
- క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 695 చిప్ సెట్
- ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ