హిందువులు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆలస్యంగా పెళ్లి చేసుకుంటారు: అసోం ఎంపీ బద్రుద్దీన్
- హిందూ పురుషులు 40 ఏళ్లకు పెళ్లి చేసుకుంటారన్న బద్రుద్దీన్
- హిందువులకు పిల్లలు తక్కువగా ఉండటానికి కారణం ఇదేనని వ్యాఖ్య
- హిందూ బాలికలు 18 నుంచి 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుంటే మంచిదని సలహా
అసోం ఎంపీ, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఫ్రంట్ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ హిందువులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుని ఆలస్యంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అన్నారు. ముస్లిం యువకులు 21 ఏళ్లు నిండిన వెంటనే పెళ్లి చేసుకుంటారని... హిందూ పురుషులు ముగ్గురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటారని, 40 ఏళ్ల వరకు అవివాహితులుగా ఉంటారని చెప్పారు.
ఇంత ఆలస్యంగా పెళ్లి చేసుకుంటే పిల్లలు ఎలా పుడతారని ఆయన ప్రశ్నించారు. హిందువులకు ఈ రోజుల్లో పిల్లలు తక్కువగా ఉండటానికి ఇదే కారణమని చెప్పారు. సారవంతమైన భూమిలో విత్తనాలు నాటితే మంచి ఫలితాలను ఆశించవచ్చని అన్నారు. పెళ్లి విషయంలో ముస్లింలు అనుసరించే విధానాన్నే హిందువులు కూడా అనుసరించాలని సూచించారు. హిందూ బాలికలు 18 నుంచి 20 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకుంటే వారికి మంచి సంఖ్యలో పిల్లలు పుడతారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై హిందూ సమాజం నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.