‘కథ వెనుక కథ’ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల
- విశ్వంత్ దుద్దుంపూడి హీరోగా 'కథ వెనుక కథ'
- హీరోయిన్లుగా శ్రీజిత ఘోష్, శుభశ్రీ
- కృష్ణ చైతన్య దర్శకత్వంలో చిత్రం
- ప్రసాద్ ల్యాబ్స్ లో టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్
- హాజరైన మురళీమోహన్
విశ్వంత్ దుద్దుంపూడి, శ్రీజిత ఘోష్, శుభశ్రీ హీరో హీరోయిన్లుగా సాయి స్రవంతి మూవీస్ సమర్పణలో దండమూడి బాక్సాఫీస్, సాయి స్రవంతి మూవీస్ బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1గా దండమూడి అవనింద్ర కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘కథ వెనుక కథ’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ లాంచ్ మరియు ఫస్ట్ లుక్‌ని గురువారం ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నటుడు, నిర్మాత మురళీమోహన్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా... నిర్మాత దండమూడి అవనింద్ర కుమార్ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా ఫస్ట్ కాపీ చూశాం. ట్విస్టులు బాగున్నాయి. మీడియా ఈ చిత్రాన్ని చూసి మద్దతు అందించాలి. ఇకపై అన్ని భాషల్లో చిత్రాలను తెరకెక్కిస్తాం. ప్రేక్షకులందరికీ వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాం. సినిమా కోసం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి ఎంతో కష్టపడ్డాడు. చిత్రానికి పని చేసిన అందరికీ థాంక్స్. అలీ, సుమన్ ఇలా అందరూ చక్కగా నటించారు. పాటలు అద్భుతంగా వచ్చాయి’’ అని అన్నారు.
మురళీ మోహన్ మాట్లాడుతూ ‘‘దండమూడి అవనింద్ర గారితో నాకు దాదాపు 35 ఏళ్ల పరిచయం ఉంది. ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగం చేసి రియల్ ఎస్టేట్ చేసి ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయుర్వేద వైద్యులు కూడా. కరోనా సమయంలోనూ అందరికీ మందులు పంచారు. కథ వెనుక కథ టైటిల్ బాగుంది. దండమూడి బాక్సాఫీస్ బ్యానర్ పేరు బాగుంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి, డైరెక్టర్ కృష్ణ చైతన్యలకు విజయం చేకూరాలి. సినిమా కోసం పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
ఈ చిత్రంలో అలీ, సునీల్, జయప్రకాష్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధు నందన్, భూపాల్, ఖయ్యుమ్, ఛత్రపతి శేఖర్, 'ఈరోజుల్లో' సాయి, రూప ఇతర పాత్రలు పోషించారు. కాగా ఈ సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించగా, కాసర్ల శ్యామ్, పూర్ణాచారి పాటలు రాశారు.