చమురు విషయంలో పాకిస్థాన్ కు షాకిచ్చిన రష్యా

  • భారత్ కు డిస్కౌంట్ ధరకు చమురును సరఫరా చేస్తున్న రష్యా
  • తమకు కూడా తక్కువ ధరకు సప్లయ్ చేయాలని కోరిన పాకిస్థాన్
  • పాక్ విన్నపాన్ని తిరస్కరించిన రష్యా
రష్యాలో అపారమైన చమురు నిల్వలు ఉన్నాయి. ఆ దేశ ప్రధాన ఆదాయ వనరుల్లో చమురు ఒకటి. అయితే ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయకుండా ఈయూ దేశాలతో పాటు, పలు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ నేపథ్యంలో తన చిరకాల మిత్రదేశం భారత్ కు డిస్కౌంట్ పై చమురు అందించడానికి రష్యా ముందుకొచ్చింది. అప్పటి నుంచి భారత్ తక్కువ ధరకే చమురును దిగుమతి చేసుకుంటోంది. 

దీంతో, పాకిస్థాన్ కూడా రష్యా నుంచి తక్కువ ధరకు చమురును పొందేందుకు ప్రయత్నించింది. పాక్ పెట్రోలియం శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ నేతృత్వంలోని అధికారుల బృందం రష్యాకు వెళ్లింది. భారత్ మాదిరే తమకు కూడా 30 నుంచి 40 శాతం డిస్కౌంట్ తో చమురును సరఫరా చేయాలని కోరారు. నవంబర్ 29న మాస్కోలో రష్యా అధికారులతో వీరు చర్చలు జరిపారు. అయితే, పాక్ అభ్యర్థనను రష్యా తిరస్కరించింది. దీంతో పాక్ మంత్రి, ఆయన బృందం ఉసూరుమంటూ స్వదేశానికి వచ్చేశారు.


More Telugu News