ప్రముఖ తమిళ నిర్మాత కె మురళీధరన్ కన్నుమూత
- గుండె పోటుతో కుంభకోణంలో కన్నుమూసిన నిర్మాత
- తమిళ అగ్ర నటులు అందరితోనూ సినిమాలు
- సంతాపం వ్యక్తం చేసిన కమలహాసన్
తమిళ పరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కె మురళీధరన్ హార్ట్ ఎటాక్ తో కుంభకోణంలో కన్నుమూశారు. తమిళ నిర్మాతల మండలి ప్రెసిడెంట్ గా లోగడ సేవలు అందించారు. దాదాపు స్టార్ హీరోలందరితో చిత్రాలు నిర్మించారు. తమిళంలో ఆయన నిర్మించిన గోకులాతిల్ సీతై తెలుగులో 'గోకులంలో సీత'గా రీమేక్ చేశారు. ఇది పవన్ కల్యాణ్ కు సూపర్ హిట్ ఇచ్చిన సినిమా కావడం గమనార్హం. తెలుగు హక్కులను గీతా ఆర్ట్స్ కొనుగోలు చేసి, ఈ సినిమాను రీమేక్ చేసింది.
లక్ష్మీ మూవీ మేకర్స్ పై.. కమలహాసన్ (అన్బే శివమ్), విజయ్ కాంత్ (ఉల్వతురై), కార్తీక్ (గోకులాతిల్ సీతై), అజిత్ (ఉన్నై తెడి), విజయ్ (ప్రియముదన్), ధనుష్ (పుదుపెట్టాయ్), శింభుతో శిలమ్ బట్టమ్ సినిమాలు నిర్మించారు. చివరిగా ఆయన నిర్మించిన సినిమా సకల కళా వల్లవన్ (జయమ్ రవి, త్రిష, అంజలి). ఇది 2015లో విడుదలైంది. శరత్ కుమార్ నటించి, 1994లో వచ్చిన అరమనై కవలన్ సినిమా నిర్మాతగా కె మురళీధరన్ కు మొదటిది.
కె.మురళీధరన్ మృతి పట్ల అగ్ర నటుడు కమలహాసన్ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నో హిట్ చిత్రాలు తీసిన లక్ష్మీ మూవీ మేకర్స్ కు చెందిన నిర్మాత ఇక లేరు. ప్రియమైన శివ, ఆ రోజులు నాకు గుర్తున్నాయి. ఆయనకు నా నివాళులు’’ అంటూ ట్వీట్ చేశారు.