యూనివర్శిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు.. ఢిల్లీ జేఎన్యూలో ఉద్రిక్తత
- క్యాంపస్ ను బ్రాహ్మణులు విడిచి వెళ్లాలని రాతలు
- దర్యాప్తుకు ఆదేశించిన యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్
ఢిల్లీలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్యూ)లో ఎప్పుడూ ఏదో ఒక ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంటుంది. తాజాగా మరో వివాదం తలెత్తింది. యూనివర్శిటీ గోడలపై గుర్తు తెలియని వ్యక్తులు బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలను రాశారు. వర్శిటీలోని స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ విభాగం గోడలు, పలువురు ఫ్యాకల్టీ గదుల డోర్లపై బ్రాహ్మణులకు వ్యతిరేకంగా, అభ్యంతరకరమైన రాతలు రాశారు.
క్యాంపస్ ను బ్రాహ్మణులు విడిచి వెళ్లాలి... బ్రాహ్మణ్-బనియాలపై ప్రతీకారం తీర్చుకుంటాం... బ్రాహ్మణ్ భారత్ చోడో వంటి పిచ్చి రాతలు రాశారు. దీంతో, వర్శిటీ క్యాంపస్ లో అలజడి చెలరేగింది. దీనిపై యూనివర్శిటీ వైస్ ఛాన్సెలర్ శాంతిశ్రీ పండిట్ దర్యాప్తుకు ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఏబీవీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న విద్యార్థుల పనేనని ఏబీవీపీ ఆరోపించింది.