ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నవంబర్ వేతనం ఎందుకు నిలపకూడదో చెప్పండి: ఏపీ హైకోర్టు

  • కరోనా సమయంలో తాత్కాలిక ప్రాతిపాదికన వైద్యులను నియమించుకున్న ప్రభుత్వం
  • వైద్యులకు 2 నెలల వేతనం ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
  • వేతనాల కోసం హైకోర్టును ఆశ్రయించిన వైద్యులు
  • తదుపరి విచారణ ఈ నెల 7కు వాయిదా
కరోనా సమయంలో తాత్కాలిక ప్రాతిపదికన నియమితులైన వైద్యులకు వేతనాల విడుదలపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ఎస్ రావత్ వేతనాన్ని ఎందుకు జప్తు చేయరాదో చెప్పాలని కూడా హైకోర్టు ప్రశ్నించింది. 

కరోనా సమయంలో వైద్య సేవల కోసం పలువురు వైద్యులను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారికి ప్రతి నెల చెల్లించాల్సిన వేతనాల్లో భాగంగా 2 నెలల వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ వేతనాల కోసం తాత్కాలిక వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కు చెందిన నవంబర్ నెల వేతనాన్ని ఎందుకు జప్తు చేయకూడదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 7కు వాయిదా వేసింది.


More Telugu News