సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ

  • బుధవారం ఏపీ సీఎస్ గా పదవీ విరమణ చేసిన సమీర్ శర్మ
  • సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ తో పాటు కాలుష్య నియంత్రణా మండలి చైర్మన్ గా బాధ్యతల స్వీకారం
  • తాడేపల్లిలో సీఎం జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన రిటైర్డ్ ఐఏఎస్
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బుధవారం పదవీ విరమణ చేసిన సమీర్ శర్మ... ఆ మరునాడు గురువారమే కొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారు. ఆయనను ఏపీ కాలుష్య నియంత్రణా మండలి చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సీఎస్ గా పదవీ విరమణ చేయడానికి ఒక్క రోజు ముందుగా సమీర్ శర్మను సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఈ క్రమంలో బుధవారం సీఎస్ గా పదవీ విరమణ చేసిన సమీర్ శర్మ... గురువారం కాలుష్య నియంత్రణా మండలి చైర్మన్ పదవితో పాటు సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గానూ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు ఆయన ఈ రెండు పదవులను చేపట్టిన తర్వాత గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను కొత్త పదవుల్లో నియమించినందుకు సమీర్ శర్మ సీఎం కు ధన్యవాదాలు తెలిపారు.


More Telugu News