బంగ్లాదేశ్ బయలుదేరిన టీమిండియా... 4న తొలి వన్డే

  • బంగ్లాతో 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనున్న టీమిండియా
  • ఈ నెల 4 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం
  • ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్
  • రెండు ఫార్మాట్లకు జట్లను ప్రకటించిన బీసీసీఐ
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుతో టీమిండియా వన్డే, టెస్టు సిరీస్ షెడ్యూల్ ఖరారు కాగా... బంగ్లా జట్టుతో సిరీస్ ల కోసం టీమిండియా గురువారం ఆ దేశానికి బయలుదేరింది. బంగ్లాతో 3 వన్డేలు, 2 టెస్టులను టీమిండియా ఆడనుంది. ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్ మొదలు కానుండగా... ఈ నెల 4న తొలి వన్డే ఢాకా వేదికగా జరగనుంది. రెండో వన్డే ఈ నెల 7న ఢాకాలోనే జరగనుండగా... చివరిదైన 3వ వన్డే ఈ నెల 10న చిట్టగాంగ్ లో జరుగుతుంది. ఆ తర్వాత ఈ నెల 14 నుంచి 18 వరకు తొలి టెస్టు, ఈ నెల 22 నుంచి 26 దాకా రెండో టెస్టు ఉంటుంది. ఈ రెండు సిరీస్ లకు సంబంధించి టీమిండియా జట్లను కూడా బీసీసీఐ ప్రకటించింది.

బంగ్లాతో వన్డే సిరీస్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, శ్రేయస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యశ్ దయాళ్.

బంగ్లాతో టెస్టు సిరీస్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఛటేశ్వర్ పుజారా; విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్, శార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్.


More Telugu News