బీఆర్ఎస్ ఏర్పాటు బీజేపీని ఉలిక్కిపడేలా చేసింది: ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఏర్పాటు బీజేపీని ఉలిక్కిపడేలా చేసింది: ఎమ్మెల్సీ కవిత
  • బెదిరించడం వంటివి టీఆర్ఎస్ సైన్యం వద్ద పని చేయవన్న కవిత
  • తెలంగాణ ప్రజలకు కట్టుబడి ఉన్నామని వ్యాఖ్య
  • ప్రజలకు సేవ చేయకుండా తమను ఎవరూ ఆపలేరన్న కవిత
ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఉలిక్కిపడేలా చేసిందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ద్వేషాన్ని పెంపొందించడం, మతోన్మాదాన్ని ప్రచారం చేయడం, బెదిరించడం వంటివి టీఆర్ఎస్ పార్టీ సైన్యం వద్ద పని చేయవని చెప్పారు. తెలంగాణ ప్రజలకు తాము కట్టుబడి ఉన్నామని.... వారికి సేవ చేయకుండా తమను ఎవరూ ఆపలేరని అన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఈ ఉదయం తన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న జనాలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. తన నివాసంలో టీఆర్ఎస్ నేతలతో చర్చలు జరిపిన అనంతరం వారితో కలిసి బయటకు వస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.


More Telugu News