ఎన్డీటీవీని అన్ ఫాలో చేసిన కేటీఆర్
- డైరెక్టర్ పదవులకు రాజీనామా చేసిన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్
- మెజార్టీ వాటాను దక్కించుకున్న అదానీ గ్రూపు
- ఇప్పటివరకు ఎన్డీటీవీ బాగా పని చేసిందన్న కేటీఆర్
ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ అయిన ప్రణయ్ రాయ్ ఆ ఛానల్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ పదవికి ఆయన భార్య రాధికా రాయ్ కూడా రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
ఎన్డీటీవీని అన్ ఫాలో చేస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు ఎన్డీటీవీ బాగా పని చేసిందని కితాబునిచ్చారు. ఎన్డీటీవీలో మెజారిటీ వాటాను అదానీ గ్రూపు దక్కించుకుంది. యాజమాన్యపు హక్కులను కూడా సొంతం చేసుకుంది. ఎన్డీటీవీ ప్రమోటింగ్ కంపెనీల్లో ఒకటైన ఆర్ఆర్పీఆర్ హోల్డింగ్స్ కంపెనీని అదానీ కొనుగోలు చేయడంతో... అదానీ గ్రూప్ కు 29.18 శాతం వాటా లభించింది. అంతేకాదు... బహిరంగ మార్కెట్ ద్వారా మరో 26 శాతం వాటా కోసం బహిరంగ మార్కెట్ ద్వారా ఓపెన్ ఆఫర్ ప్రకటించింది. ఆఫర్ పూర్తయితే అదానీ గ్రూప్ వాటా 55.18 శాతానికి పెరుగుతుంది.