విడుదలకు ముందే లీక్ అయిన ఐకూ 7 ఎస్ఈ ఫీచర్లు

  • 6.78 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే
  • 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
  • డిసెంబర్ 2న చైనా మార్కెట్లో విడుదల
  • తర్వాత భారత మార్కెట్ కు వచ్చే అవకాశం
ఐకూ 7ఎస్ఈ డిసెంబర్ 2న చైనాలో విడుదల కానుంది. దీనికంటే ముందే ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు బయటకు వచ్చాయి. ఐకూ 11 సిరీస్ ఫోన్లు కూడా అదే రోజు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఐకూ 7ఎస్ఈ భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే దీని ముందు ఎడిషన్ ఐకూ 6 ఎస్ఈని మనదేశంలో ఐకూ నియో 6 గా విడుదల చేయడం తెలిసిందే.  

ఐకూ 7ఎస్ఈలో 6.78 అంగుళాల ఫుల్ హెడ్ డీ ప్లస్ అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ వోసీ, 16జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ఉంటాయి. 4,880 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సదుపాయం, వెనుక భాగంలో మూడు కెమెరాలు, అందులో 64 మెగాపిక్సల్ తో ప్రధాన కెమెరా ఉంటాయి. దీని ధర రూ.25,000-30,000 మధ్య ఉండొచ్చని అంచనా.


More Telugu News