చైనా సరిహద్దుల్లో భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు

  • 18వ ఎడిషన్ సాయుధ దళాల సంయుక్త శిక్షణా విన్యాసాలు 
  • ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఔలి ప్రాంతంలో నిర్వహణ
  • శునకాల సేవలు సైతం వినియోగం
భారత్, అమెరికా 18వ ఎడిషన్ సాయుధ దళాల సంయుక్త శిక్షణా విన్యాసాలను నిర్వహిస్తున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఔలి ప్రాంతంలో, చైనా సరిహద్దులకు సమీపంలో ఇవి జరుగుతుండడంతో ప్రాధాన్యం నెలకొంది. దీన్ని యుద్ధ అభ్యాస్ గా అభివర్ణిస్తున్నారు. ఇరు దేశాల సైనికులు సంయుక్తంగా విన్యాసాలు చేస్తుండడం ఏటా జరుగుతున్నదే. 

సంయుక్త విన్యాసాలతో రెండు దేశాల సైనికుల మధ్య మెరుగైన సాధన, వ్యూహాలు, టెక్నిక్ లు, విధానాలు సాధ్యపడతాయని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. క్షేత్ర స్థాయి విన్యాసాలను ఎన్ఏఐ వార్తా సంస్థ వెలుగులోకి తీసుకొచ్చింది. పతంగులతో శత్రు దేశాల డ్రోన్లను ట్రాప్ చేయడాన్ని చూడొచ్చు. అలాగే ఈ విన్యాసాల్లో భాగంగా శునకాలను కూడా వినియోగిస్తున్నారు. 


More Telugu News