కవితపై చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో ధర్మపురి అర్వింద్ పిటిషన్

  • తనను చంపుతానని వార్నింగ్ ఇచ్చిందంటూ కవితపై అర్వింద్ పిటిషన్
  • తన ఇంటిపై దాడి కూడా చేశారని పేర్నొన్న అర్వింద్
  • పిటిషన్ ను కాసేపట్లో విచారించనున్న హైకోర్టు
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనను చంపుతానని మీడియా ముఖంగా వార్నింగ్ ఇచ్చిందని... ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైదరాబాద్ లో ఉన్న తన ఇంటిపై కూడా టీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడ్డారని పిటిషన్ లో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులను అవమానించిన కవితపై, ఇంటిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేలా ఆదేశాలను జారీ చేయాలని కోరారు. అర్వింద్ పిటిషన్ ను కాసేపట్లో హైకోర్టు విచారించనుంది. 

ఇటీవల అర్వింద్ పై కవిత మీడియా సమావేశంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో తాను మాట్లాడానని అర్వింద్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని... ఇంకోసారి ఇలా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో అర్వింద్ ను చెప్పుతో కొడతానని హెచ్చరించారు. అర్వింద్ ఎక్కడి నుంచి పోటీ చేసినా వెంటాడి ఓడిస్తానని అన్నారు. అర్వింద్ పిటిషన్ ను జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ విచారించనుండగా... అర్వింద్ తరపున అడ్వొకేట్ రచనారెడ్డి వాదలను వినిపించనున్నారు.


More Telugu News