'హిట్ 2' హిట్ కొడుతుందనడంలో డౌట్ లేదు: రాజమౌళి
- థ్రిల్లర్ నేపథ్యంలో సాగే 'హిట్ 2'
- రాజమౌళి ముఖ్య అతిథిగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్
- ఒకే సీజన్ లో రిలీజ్ చేస్తే బాగుంటుందన్న రాజమౌళి
- డిసెంబర్ 2న రిలీజ్ అవుతున్న సినిమా
నాని - రాజమౌళి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందువలన నాని నిర్మించిన 'హిట్ 2' సినిమాకి రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన రాజమౌళి ఈ వేదికపై మాట్లాడుతూ .. "రెండు నెలల నుంచి ఇంగ్లిష్ లో మాట్లాడి .. మాట్లాడి, ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే ఎంతో హాయిగా ఉంది. 'హిట్' ను ఒక సినిమాగా మాత్రమే కాకుండా దీనిని ఒక ఫ్రాంచైజీగా తయారు చేసినందుకు నానీని అభినందిస్తున్నాను" అన్నారు.
" నాకు తెలిసి ఇండియాలోనే ఈ తరహా జోనర్లో ఒక ఫ్రాంచైజీ లేదు. ఒక హీరోకి .. ఒక దర్శకుడికి అని కాకుండా ఒక ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండటమనేది గొప్ప విషయం. 'హిట్' అనే టైటిల్ వినపడితే చాలు .. ఆ సినిమాను చూడటానికి అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. 'హిట్ 1'లో చేసిన విష్వక్ .. 'హిట్ 2'లో చేసిన అడివి శేష్ ఈ ఫ్రాంచైజీకి చాలా ఎనర్జీని తీసుకుని వచ్చారు" అని చెప్పారు.
"ఈ సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎవరు చేశారోగానీ .. చాలా బాగా వచ్చింది. ట్రైలర్ చూడగానే ఈ హత్యలన్నీ ఎవరు చేశారనేది చూడాలనిపించింది. ఆ ఉత్సుకతను రేకెత్తించడంలో శైలేశ్ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది .. అందులో ఎలాంటి సందేహం లేదు. హిట్ 3 .. హిట్ 4 .. ఇలా ఈ ఫ్రాంచైజీలోని సినిమాలన్నీ ఒక సీజన్ లో రావాలి .. అది హిట్ సీజన్ అని జనాలకు అర్థమైపోతుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులంతా కూడా చాలా బాగా చేశారు. టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి" అంటూ ముగించారు.