రాజమౌళిగారికి ఏకలవ్య శిష్యుడిని: అడివి శేష్
- అడివి శేష్ హీరోగా 'హిట్ 2'
- నాని సొంత బ్యానర్ నుంచి మరో సినిమా
- రాజమౌళి చీఫ్ గెస్టుగా జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్
- ఆయనను గురువుగా భావిస్తున్నానని చెప్పిన శేష్
మొదటి నుంచి కూడా అడివి శేష్ విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'హిట్ 2' రెడీ అవుతోంది. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, డిసెంబర్ 2వ తేదీన భారీ స్థాయిలో థియేటర్స్ లో విడుదల కానుంది.
రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో అడివి శేష్ మాట్లాడుతూ .. "ఈ వేడుకకి అనుష్క గారిని కూడా ఆహ్వానించాము .. కానీ ఆమె రాలేకపోయారు. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లంతా బయట నుంచి వచ్చి .. కష్టపడి .. సాధించి ఈ రోజున మీ ముందు నిలబడ్డారు. నాని నచ్చనివారు .. నాని సినిమా నచ్చనివారు ఎవరూ ఉండరు .. నాతో సహా.
ఇక రాజమౌళి గారు 'బాహుబలి' చేస్తుండగా, చాలా రోజుల పాటు చాలా దగ్గర నుంచి గమనించాను. ఎప్పటికీ స్టూడెంటులా ఉండాలనే విషయాన్ని ఆయన నుంచి నేర్చుకున్నాను. ఈ రోజున నేను ఇంతగా కష్టపడానికి స్ఫూర్తి ఆయనే. రాజమౌళిగారు ఎక్కడైనా తారసపడితే 'హలో .. హాయ్' అంటూ పలకరిస్తూ ఉంటాను. నాని .. రానా మాదిరిగా నాక్కూడా ఆయనతో చనువుగా మాట్లాడాలనిపిస్తుంది.
కానీ ఒక గురువుతో శిష్యుడు అలా మాట్లాడవచ్చా? అనే సందేహంతో ఆగిపోతూ ఉంటాను. ఆయనకి నేను ఏకలవ్య శిష్యుడిని. ఎంత దూరం వెళ్లినా మన వాళ్లను మరిచి పోకూడదనే విషయాన్ని కూడా నేను నేర్చుకున్నాను. ఆడియన్స్ నుంచి నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసమే 12 ఏళ్లుగా నేను కష్టపడుతున్నాను. ప్రతిసారి సక్సెస్ అవుతానో లేదో తెలియదు గానీ, నా ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.