24 గంటల్లో 30 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించిన ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’
- జీ5 ఓటీటీలో దూసుకుపోతున్న చుప్
- సన్నీ డియోల్, దుల్కర్ సల్మాన్ శ్రేయా ధన్వంతరి నటించిన చిత్రం
- నవంబరు 25 నుంచి స్ట్రీమింగ్
- పలు భాషల్లో చిత్రం
ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 యాప్ లో నవంబర్ 25 నుంచి ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ అనే వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ అవుతుంది. ఈ చిత్రం మిస్టీరియస్ డార్క్ థ్రిల్లర్ జానర్లో రూపుదిద్దుకుంది. ఇందులో సన్నీడియోల్, దుల్కర్ సల్మాన్, శ్రేయా ధన్వంతరి ప్రధాన పాత్రల్లో నటించారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ప్రత్యేక పాత్రలో నటించారు. పూజా భట్, శరణ్య పొన్ వణ్ణన్ సహాయక పాత్రల్లో నటించారు.
పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై జయంతి లాల్ గడా, గౌరి షిండే, రాకేష్ జున్‌జున్‌వాలా, హోప్ ప్రొడక్షన్స్ అనిల్ నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి ఆర్.బాల్కి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ప్రీమియర్ అవుతోంది.
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. థియేటర్స్‌లో సక్సెస్ అయిన తర్వాత జీ 5లో ఆడియెన్స్‌ని అలరిస్తోంది చుప్ చిత్రం. 24 గంటల్లో 30 మిలియన్ వ్యూస్ రాబట్టుకోవటమే అందుకు నిదర్శనం.
దర్శక దిగ్గజం గురుదత్‌కి నివాళిగా ‘చుప్: రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారు. సినిమా విమర్శకులను లక్ష్యంగా చేసుకున్న ఓ సైకో కిల్లర్ కథాంశమే ఇది. సినీ విమర్శకుల నైతికతపై అనేక ప్రశ్నలను సంధించే థ్రిల్లర్ చిత్రమిది.