సౌత్ లో 100 కోట్లు తీసుకునే హీరోలు నలుగురైదుగురు ఉన్నారు: దిల్ రాజు
- నిర్మాతగా దిల్ రాజు నుంచి వరుస సినిమాలు
- తనకి ఎక్కువ లాభాలు తెచ్చింది 'బొమ్మరిల్లు' అంటూ వ్యాఖ్య
- 'లవ్ టుడే' కోలీవుడ్ లో భారీ హిట్ అంటూ వెల్లడి
- కన్నడ నుంచి వచ్చిన 'కాంతార' ఓ చరిత్ర అంటూ వివరణ
డిస్ట్రిబ్యూటర్ గా .. నిర్మాతగా దిల్ రాజుకి మంచి పేరు ఉంది. లాభనష్టాల సంగతి పక్కన పెడితే, ఆయన నుంచి వరుస సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రస్తుతం ఆయన చరణ్ హీరోగా ఒక సినిమా .. విజయ్ హీరోగా ఒక సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అనేక అంశాలను గురించి ప్రస్తావించారు.
"ఒక సినిమా 100 కోట్ల రూపాయలను వసూలు చేసిందంటే, ఆ మొత్తం నిర్మాతకి వచ్చేసినట్టేనని అంతా అనుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఒక సినిమా 200 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే, జీఎస్టీ .. థియేటర్ రెంటల్స్ .. ఇతర ఖర్చులు పోను నిర్మాత చేతివరకూ వచ్చేది చాలా తక్కువ. కానీ మేజిక్ ఫిగర్స్ గురించి మాత్రమే అంతా మాట్లాడుకుంటారు" అని అన్నారు.
"సౌత్ లో 100 కోట్ల పారితోషికం తీసుకునే హీరోలు నలుగురైదుగురు ఉన్నారు. కాకపోతే వాళ్లతో సినిమా తీసేటప్పుడు సరిగ్గా ప్లాన్ చేసుకోవలసిన బాధ్యత నిర్మాతదే. తక్కువ బడ్జెట్ తో నేను చేస్తే ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన సినిమా 'బొమ్మరిల్లు'. ఇప్పుడు తమిళంలో 7కోట్లకి పైగా బడ్జెట్ తో చేసిన 'లవ్ టుడే' అక్కడ 50 కోట్లకి పైగా వసూలు చేసింది. మిగతా భాషల్లో మరో 50 రాబట్టే ఛాన్స్ ఉంది. 'కాంతార' విషయానికి వస్తే అదో చరిత్ర. 25 కోట్ల లోపు బడ్జెట్ తో తీస్తే, పాన్ ఇండియా స్థాయిలో లాభాలను తెచ్చింది" అంటూ చెప్పుకొచ్చారు.