ఒకే ఓవర్ లో ఏడు సిక్సులతో రుతురాజ్ గైక్వాడ్ ప్రపంచ రికార్డు.. వీడియో ఇదిగో!
- విజయ్ హజారే ట్రోఫీలో ఆవిష్కృతమైన అద్భుతం
- యూపీ బౌలర్ శివ్ సింగ్ ఓవర్లో ఏడు సిక్సులు బాదిన రుతురాజ్
- 220 పరుగులతో అజేయంగా నిలిచిన యువ బ్యాటర్
ప్రపంచంలోనే ఎవరూ సాధించని రికార్డును మన భారతీయ బ్యాట్స్ మెన్ సాధించాడు. ఒకే ఓవర్ లో ఆరు సిక్సులను బాదడాన్ని మనం చూశాం. కానీ ఏడు సిక్సులను ఒక ఓవర్ లో కొట్టడాన్ని ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు ఈ అద్భుతం విజయ్ హజారే ట్రోఫీలో సాక్షాత్కరించింది.
మహారాష్ట్ర ఓపెనర్, టీమిండియా ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ యూపీపై మెరుపు డబుల్ సెంచరీ సాధించాడు. 159 బంతుల్లో అజేయంగా 220 పరుగులు చేశారు. ఈ క్రమంలో ఒకే ఓవర్ లో ఏడు సిక్సులు బాది ప్రపంచ రికార్డును సాధించాడు. యూపీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శివ్ సింగ్ బౌలింగ్ లో ఈ ఘనతను సాధించాడు. ఈ ఓవర్ లో ఐదో బంతి నోబాల్ గా పడటంతో... శివ్ సింగ్ అదనంగా మరో బంతిని వేయాల్సి వచ్చింది. ఆ బంతిని కూడా గైక్వాడ్ బౌండరీ వెలుపలికి తరలించాడు. దీంతో, ప్రపంచ క్రికెట్లో ఒకే ఓవర్ లో ఏడు సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా రుతురాజ్ చరిత్ర పుటల్లోకి ఎక్కాడు.