ప్రభాస్, కృతి సనన్ డేటింగ్..? హింట్ ఇచ్చిన వరుణ్ ధావన్! 

  • జలక్ ధికలాజ కార్యక్రమంలో పాల్గొన్న వరుణ్ ధావన్, కృతి సనన్
  • కృతి మరొకరి హృదయంలో ఉందన్న వరుణ్
  • అతడు ముంబైలో ఉండడు.. దీపికతో షూటింగ్ లో ఉన్నాడని వెల్లడి
ప్రముఖ నటుడు ప్రభాస్, ప్రముఖ నటి కృతి సనన్ డేటింగ్ వార్తలు ఇటీవలే వెలుగులోకి వచ్చాయి. ఇందులో నిజం ఎంతన్నది తెలియదు కానీ, నటుడు వరుణ్ ధావన్ అయితే వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు తనకు తెలిసిన విషయాన్ని పరోక్షంగా బయట పెట్టేశాడు. వరుణ్ ధావన్, కృతి సనన్ కలసి నటించిన బేదియా చిత్రం ప్రమోషన్ లో ఉన్నారు. అందులో భాగంగా ఇటీవల జలక్ ధికలాజ అనే కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంలోనే వరుణ్ ఓ విషయాన్ని వెల్లడించాడు.

కార్యక్రమం న్యాయ నిర్ణేతల్లో కరణ్ జొహార్ ఒకరిగా ఉన్నాడు. లిస్ట్ లో కృతి సనన్ పేరు ఎందుకు మిస్ అయ్యిందని వరుణ్ ను అడిగాడు. ‘‘కృతి పేరు ఇందులో లేదు. ఎందుకంటే కృతి పేరు...’’ అని వరుణ్ చెప్పబోతుండగా పక్కనే ఉన్న కృతి సనన్ అడ్డుకుంది. అయినప్పటికీ వరుణ్ చెప్పడం కొనసాగిస్తూ.. ఒకరి హృదయంలో ఉందన్నాడు. పేరు చెప్పాలని కరణ్ కోరాడు. 

‘‘ఆ వ్యక్తి ముంబైలో ఉండడు. దీపికతో షూటింగ్ లో ఉన్నాడు’’ అని వరుణ్ వెల్లడించాడు. ప్రభాస్ ప్రస్తుతం దీపిక పదుకొణెతో కలసి ప్రాజెక్ట్ కే చిత్రంలో పాల్గొంటుండడం తెలిసిందే. వరుణ్ అలా చెప్పినప్పుడు కృతి ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు చిందిస్తూ నిజమేనన్న భావనను వ్యక్తం చేయడం వారి మధ్య రిలేషన్ షిప్ కు నిదర్శనమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 



More Telugu News